‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ నన్నెంతగానో ఆకట్టుకుంది:రామ్‌చరణ్
- August 10, 2020
సత్యదేవ్, హరి చందన, రూప హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఆర్కా మీడియావర్క్స్, మహాయాణ పిక్చర్స్ పతాకాలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుదలై సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకులను ఈ చిత్రం దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ చిత్ర యూనిట్‌కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.
‘‘రీసెంట్‌గా నేను చూసిన చిత్రాల్లో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నా మనసుకెంతో నచ్చింది. అద్భుతమైన కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సత్యదేవ్, నరేశ్‌గారు, సుహాస్, హరి చందన, రూప తదితరుల నటన నన్నెంతగానో ఆకట్టుకుంది. నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, విజయ ప్రవీణ పరుచూరిగారు సహా ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు’ అన్నారు రామ్ చరణ్.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?