బీరుట్ పేలుడు నేపథ్యంలో గద్దె దిగిన లెబనాన్ ప్రభుత్వం
- August 10, 2020
బీరుట్:లెబనాన్ రాజధాని బీరుట్లో చోటుచేసుకున్న భారీ విస్ఫోటనంపై ప్రజల నుంచి పెల్లుబుకిన ఆగ్రహజ్వాలలకు అక్కడి ప్రభుత్వం తలొగ్గింది. 160 మందిని బలితీసుకున్న ఈ మహా విషాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మొత్తం మంత్రివర్గం రాజీనామా చేసింది. ప్రధానమంత్రి హసన్ దియాబ్ ఇవాళ అధ్యక్ష భవనానికి వెళ్లి తమ అందరి తరపున రాజీనామా అందజేసినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.బీరుట్లో గత మంగళవారం చోటుచేసుకున్న భారీ పేలుడుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చెలరేగిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశానికి ముందే ముగ్గురు మంత్రులు తమ పదవులకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆదివారం సమాచార మంత్రి, పర్యావరణ మంత్రులు రాజీనామా చేయగా.. ఇవాళ న్యాయశాఖ మంత్రి మేరీ క్లాడ్ నజమ్ రాజీనామా చేశారు. గత మంగళవారం చోటుచేసుకున్న బీరుట్ పేలుడు కారణంగా 160 మంది ప్రాణాలు కోల్పోగా.. 6 వేల మందికి పైగా గాయపడ్డారు మరియు 3 లక్షలు పైగా నిర్వాసితులయ్యారు. పేలుడు ధాటికి రాజధాని తీవ్ర విధ్వంసానికి గురికావడంతో పాటు, పోర్టు మొత్తం భస్మీపటలం అయిపోయింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







