హైదరాబాద్:నగరంలో రూ.123 కోట్లతో 50 థీమ్ పార్కులు-GHMC మేయర్ బొంతు రామ్మోహన్

- August 12, 2020 , by Maagulf
హైదరాబాద్:నగరంలో రూ.123 కోట్లతో 50 థీమ్ పార్కులు-GHMC మేయర్ బొంతు రామ్మోహన్

హైదరాబాద్:ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య‌క‌ర వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించుట‌కు క‌ల్పించుట‌కు న‌గ‌రంలో రూ.123 కోట్ల‌తో 50 థీమ్ పార్కుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు జిహెచ్ఎంసి మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. బుధ‌వారం ఉప్ప‌ల్ శాస‌న స‌భ్యులు బేతి సుభాష్ రెడ్డితో క‌లిసి కాప్రా స‌ర్కిల్‌లో రూ. 16.30 కోట్ల వ్య‌యంతో అభివృద్ది చేస్తున్న 6 థీమ్ పార్కుల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ...రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ఆదేశాల మేర‌కు వివిధ ర‌కాల డిజైన్ల‌తో ఆధునిక ప‌ద్ద‌తిలో థీమ్ పార్కుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ థీమ్ పార్కుల‌లో యోగా, వాకింగ్ ట్రాక్‌, ఓపెన్ జిమ్‌లు ఇత‌ర స‌దుపాయాల‌ను క‌ల్పించనున్న‌ట్లు తెలిపారు. ఢిల్లీ, ఇండోర్, బెంగ‌ళూర్ లాంటి ముఖ్య న‌గ‌రాల్లో ఉన్న థీమ్ పార్కుల‌ను ప‌రిశీలించి న‌గ‌రంలో ఏర్పాటు చేస్తున్న థీమ్ పార్కుల‌కు డిజైన్లు రూపొందించిన‌ట్లు తెలిపారు. అన్ని వ‌ర్గాలు, వ‌య‌స్సుల వారికి ఉప‌యోగ‌ప‌డేవిధంగా ఈ థీమ్ పార్కులు ఉంటాయ‌ని తెలిపారు. థీమ్ పార్కుల‌ను స‌క్ర‌మంగా వినియోగించుకోవాల్సిన బాధ్య‌త ఆయా కాల‌నీవాసుల రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్ల పై ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. కాప్రా స‌ర్కిల్‌లో నేడు శంకుస్థాపన జ‌రిగిన థీమ్ పార్కుల వివ‌రాలు...

1) ఏ.ఎస్‌.రావున‌గ‌ర్‌,   రూ. 2.30 కోట్లు

2) వాస‌వి ఎన్‌క్లేవ్ కుషాయిగూడ  రూ. 2.50

3) ఇ.సి న‌గ‌ర్ (చ‌ర్ల‌ప‌ల్లి డివిజ‌న్‌)  రూ. 2,50 కోట్లు

4) బి.ఎన్‌.రెడ్డి న‌గ‌ర్ పార్కు (చ‌ర్ల‌ప‌ల్లి డివిజ‌న్‌) రూ. 3 కోట్లు

5) మ‌ల్లాపూర్ పార్కు (మ‌ల్లాపూర్ డివిజ‌న్‌)  రూ. 3 కోట్లు

6) బండ బావి పార్కు నోమ టాకీస్ వ‌ద్ద  రూ. 3 కోట్లు ఈ కార్య‌క్ర‌మాల్లో స్థానిక కార్పొరేటర్లు పి. పావని మహిపాల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, కె అంజయ్య, జి హెచ్ ఎం సి. సూపరింటెండెంట్ ఇంజనీర్ శంకర్ లాల్, ఈ ఈ కోటేశ్వరరావు, స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com