యూఏఈ కి తిరిగొచ్చే రెసిడెంట్స్కి ఐసీఏ అనుమతి అవసరంలేదు
- August 12, 2020
నేటి నుంచి (ఆగస్ట్ 12) వలసదారులైన రెసిడెంట్స్, విదేశాల్లో చిక్కుకుపోయి వుంటే, వారు తిరిగొచ్చేందుకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసీఏ) నుంచి ప్రత్యేక అనుమతి లేకుండానే యూఏఈలోకి తిరిగి రావొచ్చు. నేషనల్ ఎమర్జన్సీ క్రౌసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్సిఇఎంఎ) అలాగై ఐసీఏ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘రెసిడెంట్స్ రిటర్న్ ప్రోగ్రాం’ పేరుతో ఈ కొత్త వెసులుబాటుని కల్పించారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సమ్మర్ హాలీడేస్ ముగిస్తున్న సమయంలో అలాగే కమర్షియల్ మరియు సోషల్ యాక్టివిటీస్ పునఃప్రారంభమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం రానుండడం గమనార్హం. అయితే, చెల్లుబాటయ్యే పీసీఆర్ కోవిడ్ 19 టెస్ట్ రిజల్ట్ తప్పక వుండాలి. అది కూడా ప్రయాణానికి 96 గంటలలోపు తీసుకున్న సర్టిఫికెట్ అయి వుండాలి. కాగా, తిరిగి వచ్చేవారికి అవసరం మేరకు పరీక్షలు నిర్వహఙంచడం, క్వారంటైన్ వంటివి వుంటాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం