ఖతార్ పబ్లిక్ స్కూల్స్ లో అడ్మిషన్స్..ఆగస్ట్ 23 నుంచి ఆన్ లైన్ ఎన్ రోల్మెంట్
- August 12, 2020
దోహా:కరోనా ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఖతార్..ఇక స్కూల్స్ ప్రారంభంపై ఫోకస్ చేసింది.ఖతార్ పబ్లిక్ స్కూల్స్ లో అడ్మిషన్స్ ను ప్రారంభించింది.స్కూల్స్ లో అడ్మిషన్ కావాలన్నా..ట్రాన్స్ ఫర్ కావాలన్నా ఈ నెల 23 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సూచించింది. పబ్లిక్ స్కూల్స్ లో తమ పిల్లలకు అడ్మిషన్ కావాలనుకునే తల్లిదండ్రలు పబ్లిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఎన్ రోల్మెంట్ ప్రాసెస్ ను పూర్తి చేయాలి. దరఖాస్తు పూర్తి చేయటానికి అప్లికేషన్ తో పాటు మెడికల్ సర్టిఫికెట్ అలాగే అడ్మిషన్ కు అవసరమైన సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్స్ విద్యార్ధి అర్హుడో కాదో నిర్ధారించేందుకు గుర్తింపు పొందిన హెల్త్ సెంటర్ల నుంచి తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాలని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?