తెలంగాణ:కోవిడ్ నష్టాల నివారణలో వాణిజ్య, పరిశ్రమలదే కీలక పాత్ర

- August 12, 2020 , by Maagulf
తెలంగాణ:కోవిడ్ నష్టాల నివారణలో వాణిజ్య, పరిశ్రమలదే కీలక పాత్ర

హైదరాబాద్:కోవిడ్-19 ద్వారా కలిగిన నష్టాలను పూడ్చడంలో, ప్రజలకు ఉపాధి కల్పించడంలో వాణిజ్య, పరిశ్రమ రంగాలదే కీలకపాత్ర అని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు.వాణిజ్య, పరిశ్రామిక రంగాలు పునరుత్తేజితం అవుతూ లక్షలాది ప్రజల ఉపాధి వ్యవస్థలను కాపాడుతున్నాయని ఆమె అన్నారు. 

గవర్నర్ ఈరోజు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ అండ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని “కోవిడ్ నష్టనివారణలో ప్రభుత్వాల వ్యూహాత్మక చర్యలు” అన్న అంశంపై ప్రసంగించారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరైన సమయంలో, సరైన చర్యలు, సకాలంలో లాక్ డౌన్ తో ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడారని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే మార్గంలో సమర్ధవంతమైన చర్యలు తీసుకుందని తెలిపారు. 
పిపిఈ కిట్స్, మాస్కులు కొరతను ఎదుర్కొన్న దేశం ఇప్పుడు ప్రభుత్వాల సమర్ధ చర్యలు, మద్ధతుతో రోజుకు ఐదు లక్షల పిపిఈ కిట్స్, మూడున్నర లక్షల మాస్కుల తయారి సామర్ధ్యాన్ని సాధించింది అన్నారు.మన దేశం వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్స్, పిపిఈ కిట్స్, ప్రాణాధార ఔషదాలు ఎగుమతి చేస్తున్నదని డా. తమిళిసై వివరించారు. 
భౌతిక దూరం, మాస్కులు పెట్టుకోవడం, శుభ్రత ద్వారా కోవిడ్ వ్యాప్తిని నివారించవచ్చని, కానీ కొందరు ప్రజలు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇవి పాటించకపోవడం ఆవేదన కనిగిస్తుందని గవర్నర్ అన్నారు. 
త్వరలోనే దేశంలో రోజుకు కనీసం 10 లక్షల కోవిడ్ నిర్ధారణ పరిక్షలు చేపట్టే దిశగా టెస్టుల సంఖ్య పెరుగుతుందని డా. తమిళిసై వివరించారు. 
ఇరవై లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ, వ్యవసాయానికి లక్ష కోట్లు ప్యాకేజీ, వలస కార్మికుల సంక్షేమం తదితర చర్యలు కోవిడ్-19 నష్ట ఉపశమన చర్యలుగా తీసుకున్నారని ఆమె తెలిపారు. 
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు రమాకాంత్ ఇనాని, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, సిఈఓ ఖ్యాతి నరవానే, పూర్వ అధ్యక్షులు కరుణేంద్ర జాస్తి, హరిశ్చంద్ర ప్రసాద్, శేఖర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. 
ఫెడరేషన్ ద్వారా కోవిడ్ మానిటరింగ్ సెంటర్ ప్రారంభించినట్లు వారు తెలిపారు. 
తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి అంచనాల రిపోర్ట్స్, తీసుకోవల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్ ప్రభుత్వానికి సమర్పించినట్లు వారు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com