తెలంగాణ:ఇరిగేషన్ శాఖలో వర్క్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు..
- August 13, 2020
తెలంగాణ:ఇరిగేషన్ శాఖను పునర్వ్యస్థీకరించి జలవనరుల శాఖగా మార్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆయా శాఖ అధికారులతో మంతనాలు జరుపుతోంది. ఈ కొత్త విధానంలో చీఫ్ ఇంజనీర్లకు (సీఈ) ప్రత్యేక అధికారాలను కల్పించనున్నారు. ప్రధాన నగరాలను ప్రాదేశిక ప్రాంతాలుగా విభజించి, ఒక్కో ప్రాంతానికి ఒక్కో సీఈని నియమించనున్నారు.
ఆ ప్రాంత పరిధిలోని ఆయకట్టు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాల్వలు, బ్యారేజీలు, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అన్నింటినీ సీఈలు పర్యవేక్షిస్తారు. వీటిల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్ లను ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు కొత్త ప్రాజెక్టులు నిర్మించారు. మరి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.
ఇవి కూడా పూర్తయితే రాష్ట్రంలో దాదాపు 1.25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావిస్తున్నారు. అయితే ఈ మేరకు శాఖను పటిష్టం చేయాలని సీఎం నిర్ణయించారు. అందులో భాగంగా భారీగా కొత్త పోస్టులను కూడా సృష్టించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 24 సీఈ పోస్టులున్నాయి. మరో 7 సీఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. అలాగే అవసరమైన మేరకు రెండు వేల వర్క్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల నియామకానికి అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కొత్తగా ఏఈఈలు, ఏఈలు వంటి 576 పోస్టులను కూడా నియమించనున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







