ఇండియన్‌ ఇంజనీర్స్‌కి ఎన్‌ఓసి తాత్కాలిక సస్పెన్షన్‌

- August 13, 2020 , by Maagulf
ఇండియన్‌ ఇంజనీర్స్‌కి ఎన్‌ఓసి తాత్కాలిక సస్పెన్షన్‌

కువైట్: సొసైటీ ఆఫ్‌ ఇంజనీర్స్‌ అలాగే పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌, తాత్కాలికంగా ఇండియన్‌ ఇంజనీర్స్‌కి ఎన్‌ఓసీని సస్పెండ్‌ చేయడం జరిగింది. వర్క్‌ పర్మిట్‌ పొందేందుకు ఫేక్‌ సర్టిఫికెట్లను కొందరు ఉపయోగించినట్లు నిర్ధారణ అవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. సౌసైటీ, ఆయా వ్యక్తుల సర్టిఫికెట్లను రిజెక్ట్‌ చేసినప్పటికీ, ఇంజనీర్‌ అనే టైటిల్‌ని పొందుతున్నారనీ, ఈ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కెఎస్‌ఇ వెల్లడించిన వివరాల ప్రకారం 3,000 మంది అప్లికేషన్లను తిరస్కరించడం జరిగింది.  ఏడుగరు వ్యక్తుల్ని ఫోర్జరీ ఆరోపణలతో పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేయడం జరిగింది కూడా.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com