బిచ్చం అడిగితే జరిమానా, జైలు శిక్ష తప్పవని హెచ్చరించిన ఒమన్

- August 13, 2020 , by Maagulf
బిచ్చం అడిగితే జరిమానా, జైలు శిక్ష తప్పవని హెచ్చరించిన ఒమన్

మస్కట్:ఒమన్ లో బిచ్చం ఎత్తుకోవటం నిషేధమని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. మసీదులు, స్టోర్స్, షాపింగ్ మాల్స్ తో పాటు ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో ఎవరైనా డబ్బులు యాచిస్తే వారికి ఏడాది జైలు శిక్ష, omr100 జరిమానా తప్పదని హెచ్చరించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎవరైనా పబ్లిక్ ప్రాంతాల్లో బిచ్చం ఎత్తుకుంటే జైలు, జరిమానాతో పాటు వారి దగ్గర ఉన్న సొమ్మును కూడా జప్తు చేస్తామని, శిక్షా కాలం పూర్తైన తర్వాత ఆ వ్యక్తిపై దేశబహిష్కరణ విధిస్తామని హెచ్చరించింది. ఒకవేళ బిచ్చం ఎత్తుకునే వ్యక్తి మైనర్ అయినా..మైనర్ తో కలిసి యాచించిన మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే మైనర్ తో బలవంతంగా బిచ్చం ఎత్తుకునేలా చేస్తే వారికి శిక్ష రెట్టింపు అవుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని పౌరులు, ప్రవాసీయులు జాగ్రత్తగా మసులుకోవాలని సూచించింది. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com