ఉగ్రమూక స్వాధీనంలో మొజాంబిక్ పోర్టు
- August 14, 2020
ఆఫ్రికాలో కీలకమైన మొజాంబిక్‌లోని పోర్ట్ ఆఫ్ మొసిమ్‌బోవాను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆక్రమించారు. ఈ ఘటన ఆఫ్రికాలో పెను సంచలనం సృష్టించింది. ఈ పోర్టుకు అత్యంత సమీపంలోనే దాదాపు 60 బిలియన్ డాలర్ల విలువైన భారీ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. కొన్నాళ్ల నుంచి ఇక్కడ పోర్టు కోసం భీకర పోరాటం సాగుతోందని మొజాంబిక్ భద్రతా దళమైన ఎఫ్‌డీఎస్ వెల్లడించింది. ఈ పోర్టు మొజాంబిక్ ప్రభుత్వం చేతిలో నుంచి ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లడం ఊహించని దెబ్బగా భావిస్తున్నారు. ఈ పోరులో భారీ సంఖ్యలో సైనికులు చనిపోగా.. మరోపక్క 59 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఒక పెట్రోల్ బోటును ముంచేశాయి. అక్కడ ప్రజలను కవచాలుగా పెట్టుకొని ఉగ్రవాదులు పోరాడుతున్నారని సైనికాధికారులు వెల్లడించారు.
ఈ పోర్టుకు దాదాపు 40 మైళ్ల దూరంలో ఉన్న అతిపెద్ద గ్యాస్‌క్షేత్రాన్ని ఫ్రాన్స్‌కు చెందిన టోటల్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇటీవల కాలంలో పోర్టు చుట్టుపక్కల నగరాలను ఇస్లామిక్ స్టేట్ సంస్థ ఆక్రమిస్తూ వస్తోంది. ఈ పోర్టు కోసం పలు మార్లు దాడులు చేసిన ఐఎస్ తాజాగా విజయం సాధించింది. మొజాంబిక్ భద్రతా దళాలు తీవ్రమైన ఆయుధ కొరతతో ఉండటాన్ని అదునుగా భావించి ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఇక్కడ ఇస్లామిక్ స్టేట్ తరఫున అహ్లు సున్నాహ్ వా జమా సంస్థ పనిచేస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







