అకామడేషన్స్‌లో తనిఖీలు కొనసాగుతాయ్‌

అకామడేషన్స్‌లో తనిఖీలు కొనసాగుతాయ్‌

మనామా:సదరన్‌ గవర్నరేట్‌, లేబర్‌ అకామడేషన్లలో తనిఖీల్ని కొనసాగించనున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఎప్పటికప్పుడు విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరన్‌ గవర్నర్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ అలి బిన్‌ ఖలీఫా అల్‌ ఖలీఫా ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గవర్నరేట్‌కి చెందిన ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ అలాగే ఇన్వెస్టిమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ ఇంజనీర్‌ ఖాలిద్‌ అబ్దుల్‌లతీఫ్‌ హాజి నేతృత్వంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సదరన్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డైరెక్టరేట్‌, సదరన్‌ ఏరియా మునిసిపాలిటీ అలాగే ఎలక్ట్రిసిటీ మరియు వాటర్‌ అథారిటీ సంయుక్తంగా ఈ తనిఖీల్ని నిర్వహించడం జరుగుతోంది. హాజి వెల్లడించిన వివరాల ప్రకారం 16 యూనిట్లను ఇప్పటికే తనిఖీలు చేశారు. ఉల్లంఘనులపై చర్యలు కూడా తీసుకున్నారు. క్రౌడ్‌ హౌసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు హాజి వివరించారు.

Back to Top