హీరో సాయితేజ్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ కొత్తచిత్రం
- August 14, 2020
కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న సుప్రీమ్ హీరో సాయితేజ్ కథానాయకుడిగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. భారీ హిట్ చిత్రాలకు కేరాఫ్ అయిన శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ, వైవిధ్యమైన కథాంశాలను ప్రాధాన్యమిచ్చే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై స్టార్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్.ప్రసాద్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో ‘సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతిః సింహరాశౌ స్థిత నమయే, అంతిమ పుష్కరే’ అని సంస్కృతంలోని వాక్యంతో పాటు షట్‌చక్రంలో ఓ కన్ను చూపిస్తున్నారు. అసలు ఈ కన్ను, షట్‌చక్రం, సంస్కృత వాక్యం వెనకున్న కథేంటనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. మిస్టీక్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రచన శాఖలో పనిచేసిన కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..