నవంబర్‌ 1 నుంచి అకడమిక్‌ ఇయర్‌

నవంబర్‌ 1 నుంచి అకడమిక్‌ ఇయర్‌

మస్కట్:నవంబర్‌ 1 నుంచి కొత్త అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభమవుతుందని ఒమన్‌ వెల్లడించింది. కోవిడ్‌ 19 స్టేట్‌ సుప్రీం కమిటీ ఈ మేరకు గురువారం సమావేశమై నిర్ణయం తీసుకుంది. మొత్తం 180 రోజుల స్టడీ డేస్‌తో ఈ క్యాలెండర్‌ని సిద్ధం చేశారు. టీచింగ్‌ స్టాఫ్‌, సంబంధిత ఉద్యోగాలకు సంబంధించిన వర్కర్స్‌, సెప్టెంబర్‌ 27 నుంచి విధులకు హాజరు కావాల్సి వుంటుంది. సంప్రదాయ క్లాసులతోపాటు ఇ-లెర్నింగ్‌ విధానానికి ప్రాముఖ్యతనివ్వాల్సిందిగా ప్యానెల్‌ నిర్ణయం తీసుకుంది. ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ సూచించిన మేరకు నిబంధనల్ని పాటించాల్సి వుంటుంది. కాగా, ఆగస్ట్‌ 7న ఒమన్‌, రెండు వారా లాక్‌డౌన్‌ని ఎత్తివేసిన విషయం విదితమే. రాత్రి వేళల్లో కర్‌ఫ్యూని శనివారం నుంచి తగ్గించారు.

 

Back to Top