బీరుట్‌కు భారత్‌ మానవతా సాయం

బీరుట్‌కు భారత్‌ మానవతా సాయం

బీరుట్ పేలుడు విషయంలో లెబనాన్‌కు భారత్ సంఘీభావం తెలుపుతోందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. కీలకమైన వైద్య, ఆహార సామాగ్రితో సహా 58 మెట్రిక్ టన్నుల అత్యవసర మానవతా సహాయాన్ని బీరుట్‌కు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐఎఎఫ్ సి 17 విమానంలో సహాయ సామాగ్రి బీరుట్‌కు వెళ్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 4 న లెబనీస్ రాజధాని ఓడరేవులో ఘోరమైన పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లలో 158 మంది మరణించగా 6 వేల మందికి పైగా గాయపడ్డారు. నగరంలోని సగం మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.

ఒక బిలియన్ డాలర్ల మేర నష్టం వాటినట్లు అంచనా. లెబనీస్ ప్రభుత్వం ప్రకారం రక్షణ నియమాలను ఉల్లంఘించి 2,750 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను 2014 నుంచి నిల్వ ఉంచడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లుగా పేర్కొంది. అంతకుక్రితం ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ... బీరుట్ అనంతరం పరిస్థితిని ఎదుర్కోనేందుకు లెబనాన్‌కు భారత్ సహాయంగా ఉండనున్నట్లు తెలిపారు. మరింత సహాయ సామాగ్రిని పంపనున్నట్లు చెప్పారు.

Back to Top