ఆగస్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం

- August 14, 2020 , by Maagulf
ఆగస్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం

 విజయవాడ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మున్సిపల్‌ స్టేడియంలో వేడుకల ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం సిద్ధంగా ఉందన్నారు.కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేడుకల్లో పాల్గొని గౌరవ జెండావందనం చేయనున్నారు. పెరేడ్‌కు సంబంధించిన ఫైనల్‌ రిహార్సల్స్‌ని వీక్షించిన గౌతమ్‌ వారికి పలు సూచనలు చేశారు. రేపు పెరేడ్‌లో ఆరు బెటాలియన్లకు చెందిన ఆరు కంటింజెంట్లు పాల్గొంటుండగా.. వివిధ శాఖలకు చెందిన పది శకటాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి.ఆయన వెంట సీఎస్‌ నీలం సహానీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, సీఎం పోగ్రాం కో-ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com