ఆన్ లైన్లో కోవిడ్-19 పరీక్ష ఫలితాన్ని ఇలా తెలుసుకోవచ్చు
- August 15, 2020
అమరావతి: ఏ.పీ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా కోవిడ్ టెస్ట్ కోసం రిక్వెస్ట్ చేసేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కోవిడ్ పరీక్ష ఫలితాలను కూడా ఆన్ లైన్లో అందుబాటులోకి తెచ్చింది.
మొన్నటి వరకు ఫలితం వచ్చినా కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచో, ఆరోగ్యశాఖ నుంచి మెసేజ్ వచ్చే వరకు తెలిసేది కాదు. ఇప్పుడు అలా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీ కరోనా టెస్ట్ రిజల్ట్స్ మీరు కూడా తెలుసుకోవచ్చు.
దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి ఏపీలో కోవిడ్ టెస్టులు చేయించుకున్నవారు వారికి ఇచ్చిన శాంపిల్స్ నెంబర్ లేదా అధార్ కార్డు నెంబర్ లేదా ఫోన్ నెంబర్ ఉపయోగించి ఈ క్రింద లింక్‌ను క్లిక్ చేసి http://dashboard.covid19.ap.gov.in/ims/knowSampleStatus/ టెస్టు రిజల్ట్స్‌ను తెలుసుకోవచ్చు.
కోవిడ్ టెస్టు రిజల్ట్స్ ఆలస్యంగా వస్తున్నాయన్న విషయాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త వెబ్‌సైట్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







