భారత్:గడిచిన 24 గంటల్లో 65 వేల పాజిటివ్ కేసులు
- August 15, 2020
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ సంఖ్య మరింత పెరిగి 65,002 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 25,26,192కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య కూడా 50వేలకు చేరుకుంది. ప్రతి రోజు దాదాపుగా వెయ్యి కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ఇక కొవిడ్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 18,08,936కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,68,220 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!







