దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

- August 15, 2020 , by Maagulf
దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

దుబాయ్:దుబాయ్ లోని ఇండియ‌న్ కాన్సులేట్ కార్యాల‌యంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఉద‌యం 7.30 గంట‌ల‌కు భార‌త కాన్సుల్ జన‌ర‌ల్ డా.అమ‌న్ పూరి జాతీయ జెండాను ఎగుర‌వేశారు. మ‌హ‌మ్మారి కోవిడ్ నేప‌థ్యంలో ఈసారి ఈ కార్య‌క్ర‌మానికి ప‌బ్లిక్‌ను అనుమ‌తించ‌లేదు. కేవ‌లం కార్యాల‌యం సిబ్బంది, అధికారులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. దీంతో దుబాయ్ లోని భార‌త ప్ర‌వాసులు ఆన్‌లైన్‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించారు. కాన్సులేట్ ఆఫ్ ఇండియా అధికారిక సోష‌ల్ మీడియా లో ప్ర‌వాసుల కోసం ఈ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా దుబాయ్ కి చెందిన‌ ప్రముఖ గాయకుడు సూరజ్ భారతి దేశభక్తి గీతం పాడగా, ఒక నృత్య బృందం వేదిక వద్ద శాస్త్రీయ నృత్యాలు చేసింది. 

అనంత‌రం కాన్సుల్ జనరల్ డా.అమన్ పూరి ఈ సభలో ప్రసంగించారు. భారతీయ సమాజంలోని సభ్యులు, మా ఎమిరాటి స్నేహితులు,దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న ప్ర‌వాస భార‌తీయుల‌కు ప్ర‌త్యేకంగా స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను అని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com