సెలూన్లకు మార్గదర్శకాలు‌: షేవింగ్‌, మేకప్‌లకు అనుమతి లేదు

- August 15, 2020 , by Maagulf
సెలూన్లకు మార్గదర్శకాలు‌: షేవింగ్‌, మేకప్‌లకు అనుమతి లేదు

కువైట్: బార్బర్‌ షాప్‌లు, మహిళా సెలూన్లు మంగళవారం నుంచి తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ కొన్ని గైడ్‌ లైన్స్‌ జారీ చేసింది. ఈ మార్గదర్శకాల‌ ప్రకారం, సెలూన్‌ దుకాణాల్లో ఒక్కో ఉద్యోగి ఒక్కో కమస్టర్‌ కోసం మాత్రమే పనిచేయాలని పేర్కొన్నారు. గడ్డం షేవింగ్‌కి అనుమతి లేదు. రబ్బింగ్‌ అలాగే ఫేస్‌ స్క్రబ్బింగ్‌కి కూడా అనుమతి లేదు. ఐబ్రోస్‌ డైయింగ్‌, మేకప్‌ వంటివాటికీ అనుమతినివ్వరు. మొరాకో లేదా టర్కిష్‌ బాత్‌ సర్వీసులు, జాక్విజ్జిస్‌, సానా మరియు మస్సాజ్‌ లపై నిషేధం తదుపరి ప్రకటన వరకు కొనసాగుతుంది. తప్పనిసరిగా సెలూన్లు ఈ నిబంధనల్ని పాటించాలి. సెలూన్‌లో వినియోగించే పరికరాలను వినియోగించిన ప్రతిసారీ స్టెరిలైజ్‌ చేయాల్సి వుంటుంది. వినియోగదారుడు ఆప్రాన్‌ ధరించాలి. ఆమోదం పొందిన డిస్‌ఇన్‌ఫెక్టెంట్లు మాత్రమే వాడాలి. ఎయిర్‌ కండిషన్‌ ఫిలట్లర్లు, వెంటిలేషన్‌ సిస్టమ్ క్లీన్‌గా వుండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ సిబ్బందికి స్క్రీనింగ్‌ చేయాల్సి వుంటుంది. అపాయింట్‌మెంట్‌ ద్వారా మాత్రమే సెలూన్‌లోకి వచ్చేందుకు అనుమతివ్వాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com