సౌదీ:వచ్చే వారం నుంచి విధులకు హజరవనున్న టీచర్లు
- August 16, 2020
రియాద్:కోవిడ్ సంక్షోభం తర్వాత మళ్లీ సాధారణ జనజీవన ప్రక్రియను ప్రారంభించిన సౌదీ అరేబియా ప్రభుత్వం..ఇక స్కూల్స్ పై ఫోకస్ చేసింది. పకడ్బందీ ముందస్తు జాగ్రత్త చర్యలతో ఆగస్ట్ 30 నుంచే విద్యా వార్షిక సంవత్సరాన్ని ప్రారంభించాలని సౌదీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు లక్షా 14 వేల విద్యాసంస్థల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్లు వచ్చే వారం నుంచి విధులకు హజరుకాబోతున్నారు. అయితే..కరోనా మహమ్మారి భయం ఇంకా వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్ధులకు పాఠాలు ఎలా బోధిస్తారనేది చాలా మంది తల్లిదండ్రుల్లో ఆవేదన నెలకొని ఉంది. అలాగే ఆగస్ట్ 30 నుంచి అకాడమిక్ ఇయర్
ప్రారంభం అయినా...పాఠాలు ఆన్ లైన్ ద్వారా బోధిస్తారా, క్లాస్ రూమ్స్ లోనే క్లాసెస్ తీసుకుంటారా...లేదంటే రెండు విధానాలు అనుసరిస్తారా అనేది కూడా విద్యార్ధుల తల్లిదండ్రుల్లో గందరగోళలం నెలకొని ఉంది. బోధన విధనం ఇప్పటి వరకైతే స్పష్టత లేకున్నా...అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్ధులను వైరస్ బారి నుంచి రక్షించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు ఖచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ స్కూల్ నిర్వాహకులకు ఆదేశాలిచ్చింది. అలాగే ముందస్తు జాగ్రత్త చర్యల అమలు సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసేందుకు ఓ కమిటీని కూడా నియమించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







