అబుధాబి:ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 16, 2020
అబుధాబి:74 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు యూఏఈలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో నిరాడంబరంగా జరిగాయి.కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ యూఏఈ ప్రభుత్వం ఇచ్చిన పరిమితమైన అనుమతుల మేరకు ISC యాజమాన్యం మొత్తం వేడుకలను రెండు భాగాలు గా విభజించి నిర్వహించింది.ఉదయం 07:30 గంలకు ISC యాజమాన్య కార్యవర్గం మరియు సెంటర్ ఉద్యోగుల సమక్షం లో జాతీయ పతాకాన్ని ISC అధ్యక్షుడు యోగేష్ ప్రభు ఎగుర వేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభు ఎందరో వీరుల త్యాగ ఫలితమే మనము అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వాయువులని మరియు అందరము దేశ ప్రగతి కి తోడ్పడిన నాడే వారికి నిజమైన నివాళి అర్పించిన వాళ్లము అయితామని తెలియ జేశారు. ముఖ్యముగా ఈ కార్యక్రమాన్ని సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా వీక్షిస్తున్న సంఘ సభ్యులు మరియు యూఏఈలో ఉంటున్న ఎంతో మంది భారతీయులందరికి 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు.అలాగే కరోనా ప్రభావం మరియు ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకు ఇలా జరుపుకోవాల్సి వచ్చిందని సంఘ ప్రధాన కార్యదర్శి జోజో అంబూకేన్ తెలియ జేశారు.
అలాగే కార్యక్రమం లో రెండో భాగమైన సాంస్కృతిక కార్యక్రమం సాయంత్రం 7:౩౦ నుండి రెండు గంటల పాటు జరుపుకున్నారని సాంస్కృతిక కార్య దర్శి జయప్రదీప్ తెలియ జేశారు.ఈ కార్యక్రమం లో 10 రాష్ట్రాల సాంస్కృతిక సంఘాలు పాలు పంచుకున్నాయి అని దక్షిణ భారత కార్యదర్శి రాజాశ్రీనివాస రావు తెలియ జేశారు.ఈ కార్యక్రమం లో తెలుగు వారి తరపున పావని ఆధ్వర్యంలో కుమారి వర్షిణి, కుమారి ఆముక్త, కుమారి కువీర, కుమారి సంస్కృతి, కుమారి అక్షర, చిరంజీవి కవీష్ మరియు చిరంజీవి అభిరామ్ పాల్గొని ప్రేక్షకులను ఎంతగానో వారి నృత్య ప్రదర్శనతో ఆకర్శించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలుగు వారి ప్రదర్శన కార్యక్రమానికే వన్నె తెచ్చిందని ఉపాధ్యక్షులు జార్జి వర్గీస్ అన్నారు.ఈ కార్యక్రమాన్ని జూమ్ ద్వారా యూఏఈ లో ఉన్న ఎందరో భారతీయులు వీక్షించారని సెంటర్ జనరల్ మేనేజర్ రాజు అన్నారు.అలాగే భారత దౌత్య కార్యాలయం 74 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిపిన ఆన్లైన్ దేశ భక్తి గీతాల మరియు చిత్ర లేఖన ప్రదర్శన లో చిరంజీవి కవీష్ పాడిన పాటను కాన్సులేట్ జనరల్ అభినందించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన తెలుగు మిత్రులు మరియు వారి కుటుంబ సభ్యులందరికి రాజాశ్రీనివాస రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!