ఏక్‌దో తీన్ ప్రేమకథ
- August 16, 2020
ఏక్ దో తీన్ ప్రొడక్షన్ పతాకంపై మురళీ బోడపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఒక అమ్మాయితో.. (కోవిడ్ టైమ్ కహానీ) అనేది ఉప శీర్షిక, గార్లపాటి రమేష్, డా.భట్ నిర్మాతలు, శీతల్ భట్, సూరత్ పవన్, శ్రీరాగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... ఇది చక్కని యూత్‌ఫుల్ లవ్ స్టోరీ.వినోదం ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ప్రస్తుతం విజయవాడ పరిసరరాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. కథరీత్యా చక్కటి లొకేష్లన్లలో తెరకెక్కిస్తున్నాం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఇంకా ఈ చిత్రంలో రఘు కారుమంచి, గుర్లీన్ చోప్రా, అశోక్‌కుమార్, జబర్దస్త్ పణి, జీవన్, పటాస్ పవన్, సుశీల్ మాధవపెద్ది, సురేశ్‌బాబు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతంః కన్ను సమీర్, సినిమాటోగ్రఫీః తోట వి. రమణ, ఎడిటర్ః కిషోర్ మద్దాలి, కొరియోగ్రఫీః భాను మాస్టర్, ఆర్ట్ః పి.ఎస్. వర్మ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ః సుధాకర్ బెనర్జీ, మేకప్ః బాలు, కాస్ట్యూమ్స్ః రఫీ, కథ, స్స్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వంః మురళీ బోడపాటి, నిర్మాతలుః గార్లపాటి రమేశ్, డా. వి. భట్.


తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







