కెనడాలో భారీ సైబర్ దాడి

- August 16, 2020 , by Maagulf
కెనడాలో భారీ సైబర్ దాడి

టొరంటో: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కలవర పెడుతుంటే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జనంలో భయాన్ని, అనుమానాల్ని, ఆందోళనల్ని లక్ష్యంగా చేసుకొని అనేక మార్గాల్లో వైరస్‌లను కంప్యూటర్ లోకి చొప్పించేందుకు హ్యాకర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా సైబర్ దాడులు జరుగుతున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్, జపనీస్, టర్కిష్ సహా ఇటాలియన్ భాషల్ని ఉపయోగిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు సామాన్యులను, పరిశ్రమల్ని, రవాణా వ్యవస్థల్ని, ఆరోగ్యం, ఇన్సూరెన్స్, ఆతిథ్యం, తయారీ రంగాలను సైబర్ క్రిమినల్స్ లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు కెనడా ప్రభుత్వ సైట్లను టార్గెట్ చేశారు.

పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖాతాలు హాకింగ్‌కు గురికావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గోప్యత ఉల్లంఘనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. కాగా, రెవెన్యూ ఏజెన్సీ ఖాతాలతో సంబంధం ఉన్న బ్యాంకింగ్‌ సమాచారం మార్చబడిందని ఆగస్ట్‌ మొదటి వారంలోనే చాలా మంది కెనెడియన్లు ఫిర్యాదు చేసిన ప్రభుత్వం పట్టించుకోనేట్లు తెలుస్తోంది. ఫలితంగా కరోనావైరస్‌ సంక్షోభ సమయంలో ప్రభుత్వం అందిచిన ఆర్థిక సాయం అర్హులకు అందకుండా పోయిందని ఆ దేశ మీడియా పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com