షూటింగ్ లొకేషన్ లో యూనిట్ మధ్య బర్త్ డే కేక్ కటింగ్ మిస్ అవుతున్న - నిధి అగర్వాల్
- August 16, 2020
ఆగష్టు 17న హ్యాపెనింగ్ బ్యూటీ నిధి అగర్వాల్ పుట్టినరోజు. మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులుకు చాలా దగ్గర అయిపోయింది హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నిధి ఈ ఏడాది తన పుట్టినరోజును(ఆగష్టు17) బెంగళూరులో తన నివాసంలోనే కుటుంబ సభ్యులు మధ్య జరుపుకుంటున్నారు. సినీ కెర్రిర్ స్టార్ట్ చేసాక తన పుట్టినరోజు సెట్స్ లోనే జరిగేదని, యూనిట్ సభ్యులు మధ్య కేక్ కటింగ్ సెలెబ్రేషన్స్ జరిగేవని, ప్రస్తుతం కరోనా కారణంగా తాను యాక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్స్ ప్రస్తుతం ఆగిపోవడం కారణంగా ఈ ఏడాది ఇంట్లో కుటుంబంతోనే పుట్టినరోజు జరుపుకుంటున్నట్లుగా నిధి తెలిపారు. ప్రస్తుతం నిధి, మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ లాంఛింగ్ మూవీలో నటిస్తున్నారు, అలానే తమిళ్ లో భూమి అనే చిత్రం చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని కొత్త కథలు వింటున్నారు. ఇక తాజాగా ఫేస్ బుక్ లో సరోకొత్త రికార్డు సెట్ చేశారు నిధి. ఈ జనరేషన్ యంగ్ హీరోయిన్స్ లో అత్యధికంగా 8.5 మిలియన్ ఫేస్ బుక్ ఫాలోవర్స్ తో నిధి మొదటి స్థానంలో ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?