ప్లాస్మా దాతలకోసం ఓ వెబ్‌సైట్
- August 16, 2020
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైరస్ తో పోరాడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కొవిడ్ ను నయం చేయడంలో ప్లాస్మా థెరపీతో మెరుగైన ఫలితాలు కలుగుతున్నాయనే నిపుణుల మాటలు కొంతవరకు ఊరటనిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో రక్తదాతల సమాచారం కలిగి ఉన్న ఫ్రెండ్స్2సపోర్ట్. ఓఆర్జీ (Friends2support.org) అనే స్వచ్చంధ సంస్థ తమ వెబ్సైట్, అప్లికేషన్లలో ' కోవిడ్-19 ప్లాస్మాదాత ' అంశాన్ని కొత్తగా చేర్చింది. వైరస్ పై విజయం సాధించి, ఇతర కోవిద్ బాధితులకు సాయం చేయాలనుకునేవారు అందులో స్వచ్ఛందంగా ప్లాస్మాదాతలుగా నమోదు చేసుకోవచ్చు.
వైరస్ సోకిన వారిలో కొద్ది మందికే ప్లాస్మా థెరపీ అవసరమవుతోందని, వారి బ్లడ్ గ్రూపులకు సరిపడే దాతను కనుక్కోవడం వైద్యులకు కష్టతరంగా మారిందని సంస్థ వ్యవస్థాపకుడు షేక్ షరీఫ్ అన్నారు. 2005 లో సంస్థను స్థాపించిన ఆయన ఇప్పటివరకు రెండు సార్లు ఐక్య రాజ్య సమితి నుంచి అవార్డు అందుకున్నారు.
' ప్లాస్మా దాతను కనుక్కోవడంలో కోవిడ్ బాధితులు, వారి బంధువులు, వైద్య సిబ్బంది పనిని సులభం చేసేందుకు మేము వారం రోజులుగా ఈ అంశంపై ట్రయల్ నిర్వహించాం. దీని గురించి ప్రకటించకముందే ఆంధ్ర, తెలంగాణకు చెందిన కొవిద్ విజేతలు ప్లాస్మా దాతలుగా నమోదు చేసుకున్నారు. వెబ్సైట్ లో 6 దేశాలకు చెందిన 5 లక్షల మంది సాధారణ రక్తదాతలు స్వచ్చంధంగా నమోదు చేసుకున్నారు. అందులో ఎక్కువ మంది భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారే. జిల్లా యంత్రాంగం సహకారంతో కోవిడ్ ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల వద్ద తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉన్న పోస్టర్లను అతికిస్తున్నాం. ఫలితంగా డిశ్ఛార్జి అవుతున్నవారు తమ ప్రాంతంలో వైరస్ సోకిన వారికి సాయం చేయాలనే ప్రేరణ కలిగి వెబ్సైట్ లో నమోదు చేసుకుంటారు ' అని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







