ఒమన్ లో టీఆరెస్ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 16, 2020
మస్కట్:మస్కట్ లో టీఆరెస్ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ వారు 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు.ఈ సంధర్బంగా టీఆరెస్ ఒమన్ శాఖ అధ్యక్షుడు మహిపల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం వేడుకలను నిరాడంబరంగా పరిమితి సంఖ్యలో తగిన జాగ్రత్తలు తీసుకుని జెండా ఎగురవేసం అని తెలిపారు.
'ఎందరో దేశభక్తుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వాళ్లందరినీ మనసులో స్మరించుకుని నివాళులు అర్పించే శుభ సందర్భం ఇది.అతి గొప్ప ప్రజాస్వామ్యం, సమగ్రమైన లిఖిత పూర్వక రాజ్యాంగం, ప్రాధమిక హక్కులు, ఆదేశ సూత్రాలతో ప్రపంచానికే తలమానికంగా మన దేశాన్ని తీర్చిదిద్దారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. హక్కులను నిలబెట్టుకోవడం, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడుకోవడం, వ్యవస్థలను-రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే జాతీయ వీరులకు మనం అందించే నిజమైన నివాళిగా' మహిపల్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఒమన్ లో ఆపదలో ఉన్న తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారి సహాయం కోసం ఒమన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రవాసి సేవా సంఘం కి సంబంధించిన వెబ్సైట్ ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షలు షైక్ అహ్మద్,ఆంజనేయులు,అనిల్, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ,సాయి కుమార్ ,కార్యదర్శులు మధు,వీరేందర్,లక్ష్మణ్,కిరణ్,జాగృతి ఉపాధ్యక్షుడు వినోద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







