బహ్రెయిన్:వినాయక విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళపై కేసు
- August 16, 2020
మనామా:మనామా సమీపంలోని జుఫెయిర్ పట్టణంలో ఓ మహిళ వినాయక విగ్రహాలను ధ్వంసం చేసింది.సూపర్ మార్కెట్లో అమ్మకానికి పెట్టిన ఈ విగ్రహాలను ఆమె ఒక్కొక్కటిగా తీసి,నేలకేసి కొట్టి, ముక్కలు చేసింది.ఆమె చేస్తున్న అకృత్యాన్ని మరొక మహిళ వీడియో తీసింది.ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
54 ఏళ్ళ వయసుగల ఆ మహిళ వినాయక విగ్రహాలను ధ్వంసం చేసింది.ఆ సూపర్ మార్కెట్ వర్కర్‌ను ఉద్దేశించి ఇస్లామిక్ దేశంలో ఇలాంటివి చెల్లవంటూ మండిపడింది.క్యాపిటల్ గవర్నరేట్ పోలీసు డైరెక్టర్ జనరల్ ప్రకారం, వినాయక విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.మతపరమైన మనోభావాలను అగౌరవపరచినందుకు, ఓ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాల పట్ల అమర్యాదకరంగా వ్యవహరించినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు.
ఆమెపై కేసు పెట్టిన విషయాన్ని బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ కూడా ధ్రువీకరించింది. జుఫెయిర్లోని సూపర్ మార్కెట్లో విగ్రహాలను ధ్వంసం చేసిన మహిళపై కేసు నమోదు చేసినట్లు ఓ ట్వీట్లో తెలిపింది.

తాజా వార్తలు
- కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు
- IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి
- ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- ప్రధాని మోదీని వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన రూబియో
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్‌పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!









