ఒమన్ లో తగ్గిన ప్రవాసీయుల సంఖ్య
- August 17, 2020
మస్కట్:ఒమన్ లో ప్రవాసీయుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గత నెల రోజులుగా 96 వేల మంది ఒమన్ నుంచి వెళ్లిపోయినట్లు జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం ప్రకటించింది. ఒమనైజేషన్ ప్రభావంతో ఒమన్ స్వదేశీయులతో విదేశీల నిష్పత్తి తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 15, 2020 నాటికి జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఒమన్ జనాభాలో ఒమనీయుల సంఖ్య 60.60 శాతంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ప్రస్తుతం ఒమనీయుల సంఖ్య 27,28,724 మంది ఉన్నారు. ఇక ప్రవాసీయుల జనాభా 39.40 (17,75,577) శాతం ఉన్నట్లు ఎన్సీఎస్ఐ స్పష్టం చేసింది. ఇదిలాఉంటే జులై 21 నాటికి ప్రవాసీయుల సంఖ్య 18,72,170 (40.08శాతం) మంది ఉన్నట్లు వెల్లడించింది. అంటే ఈ ఒక్క నెలలోనే 96 వేల మంది ప్రవాసీయులు ఒమన్ విడిచి వెళ్లినట్లు ఎన్సీఎస్ఐ ప్రకటించింది.
తాజా వార్తలు
- కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు
- IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి
- ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- ప్రధాని మోదీని వైట్‌హౌస్‌కు ఆహ్వానించిన రూబియో
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్‌పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!









