యూఏఈ ఆమ్నెస్టీ గడువు పొడిగింపు
- August 17, 2020
అబుధాబి: మార్చి 1 లోపు వీసాలు గడువు ముగిసిన తరువాత యూఏఈ లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న ప్రజలు దేశం విడిచి వెళుతున్నట్లయితే అన్ని ఓవర్‌స్టే జరిమానాలు కూడా మాఫీ చేసేట్టు అమ్నెస్టీ ఆగష్టు 18, 2020 వరకు ప్రకటించడం జరిగింది. అయితే, ఆ కాలాన్ని ఇప్పుడు మూడు నెలలకు (అనగా నవంబర్ 17, 2020 వరకు) పొడిగించినట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ మేజర్ జనరల్ సయీద్ రాకన్ అల్ రషీది తెలిపారు.
వీసాల గడువు ముగిసిన అక్రమ నివాసితులందరికీ దేశం నుండి బయలుదేరేటప్పుడు జరిమానాలు మాఫీ అయ్యేందుకు అవసరమైన చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా ట్రావెల్ డాక్యుమెంట్ మరియు ప్రయాణ టికెట్ అవసరం అని రషీది తెలిపారు.
విసిట్ వీసా/టూరిస్ట్ వీసా/రెసిడెన్సీ వీసా మార్చి 1 కి ముందే గడువు ముగిసినట్లైతే, చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న ప్రజలకు ఈ రుణమాఫీ వర్తిస్తుంది. జరిమానాలు బారినపడకుండా యూఏఈ అందిస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దేశం విడిచి వెళ్లాలని అల్ రషీది నేరస్థులకు పిలుపునిచ్చారు.
విసిట్ వీసా/టూరిస్ట్ వీసా/రెసిడెన్సీ వీసా/ఉద్యోగాలు కోల్పోయిన నివాసితులు, మార్చి 1 తర్వాత వీసాల గడువు ముగిసినట్లైతే, వారి వీసాలు రద్దు చేయబడినవారికి ఈ రుణమాఫీ పథకం విస్తరించదు అని వివరించారు.
విమానాశ్రయాలకు కొన్ని గంటల ముందే..
ఆమ్నెస్టీ కేంద్రాలలో ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరమయ్యే మునుపటి అమ్నెస్టీ పథకాల మాదిరిగా కాకుండా, ఈసారి, వారి రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన తరువాత రుణమాఫీ కోరుకునే వ్యక్తి నేరుగా విమానాశ్రయానికి వెళ్ళాలి. గడువు ముగిసిన విసిట్/టూరిస్ట్ వీసాలు కలిగి ఉన్నవారికి, మాఫీ నుండి ప్రయోజనం పొందే సౌకర్యాన్ని వినియోగుకోవటానికి ఉల్లంఘకులు యూఏఈ లోని ఏ విమానాశ్రయం నుండి అయినా ప్రయాణించవచ్చు. కానీ, వారు విమానాశ్రయానికి ఎప్పుడూ వెళ్లే సమయం కంటే కొన్ని గంటల ముందు వెళ్లాలి. అబుదాబి, షార్జా మరియు రస్ అల్ ఖైమా విమానాశ్రయాలలో బయలుదేరే సమయానికి ఆరు గంటల ముందు విమానాశ్రయాలకు వెళ్లాలి. అదే దుబాయ్ నుండి బయలుదేరడానికి నిర్ణయించుకుంటే, బయలుదేరే సమయానికి 48 గంటల ముందు అతను తనిఖీ కేంద్రానికి వెళ్లాలి. డిపెండెంట్లతో రుణమాఫీ కోరుకునేవారు కుటుంబ సభ్యులందరూ ఒకే సమయంలో బయలుదేరేలా చూడాలని మేజర్ జనరల్ అల్ రషీది అన్నారు.
తనిఖీ కేంద్రాలు..
దుబాయ్ తనిఖీ కేంద్రాలు; అల్ ఖుసైస్ పోలీస్ స్టేషన్, సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సెంటర్ మరియు టెర్మినల్ 2 సమీపంలో బహిష్కరణ కేంద్రం. 15 ఏళ్లలోపు వయసున్నవారు మరియు వికలాంగులు తనిఖీ కేంద్రాలకు వెళ్లనవసరంలేదు. ఏదైనా సందేహాలు ఉంటే ప్రజలు 800453 కు కాల్ చేయవచ్చని, సెలవులు మినహా కాల్ సెంటర్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంది అని మేజర్ జనరల్ అల్ రషీది తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం