తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
- August 17, 2020
విశాఖపట్నం:వర్షం ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు అధికారులు ప్రకటించారు. చత్తీస్గడ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి చెదురు మదరుగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు ప్రకటించారు. అలాగే ఈనెల 19న ఉత్తర బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
ఇదిలాఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. కొన్ని ప్రాజెక్టులకు వరద పోటు ఎక్కువగా ఉండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి