62 మంది న్యాయమూర్తుల ప్రమోషన్‌కి సౌదీ రాజు ఆదేశాలు

- August 17, 2020 , by Maagulf
62 మంది న్యాయమూర్తుల ప్రమోషన్‌కి సౌదీ రాజు ఆదేశాలు

రియాద్‌: కింగ్‌ సల్మాన్‌, 62 మంది న్యాయమూర్తులను ప్రమోట్‌ చేస్తూ రాయల్‌ ఆర్డర్‌ని జారీ చేయడం జరిగింది. జస్టిస్‌ మినిస్టర్‌ అలాగే సుప్రీం జ్యుడీషియల్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ డాక్టర్‌ వాలిద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ సామాని ఈ సందర్భంగా కింగ్‌ సల్మాన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. జ్యుడీషియల్‌ సిస్టవ్‌ులో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పుల దిశగా సౌదీ అరేబియా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇ-నోటరైజేషన్‌ విధానాన్ని ఇటీవలే మినిస్ట్రీ ప్రారంభించింది. లో రిస్క్‌ పవర్స్‌ ఆఫ్‌ అటార్నీకి సంబంధించి ఈ విధానం ఎంతో వీలుగా వుంటుంది. మినిస్ట్రీ పోర్టల్‌ ద్వారా పవర్స్‌ ఆఫ్‌ అటార్నీని ఏజెన్సీలు వెరిఫై చేయడానికి వీలుపడుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com