సందీప్ కిషన్ నిర్మాతగా ‘వివాహ భోజనంబు’
- August 17, 2020
యువ కథానాయకుడు సందీప్ కిషన్‌లో అభిరుచి గల నిర్మాత, మంచి భోజన ప్రియుడు ఉన్నారు. ప్రజలకు రుచికరమైన భోజనం, వంటలు వడ్డించడానికి ‘వివాహ భోజనంబు’ అని హైదరాబాద్ నగరంలో, తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు ప్రారంభించి తమ సేవలు అందిస్తున్నారు. ఈ రెస్టారెంట్లు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. ఇప్పుడు ‘వివాహ భోజనంబు’ అని ఓ సినిమా నిర్మించడానికి సందీప్ కిషన్ శ్రీకారం చుట్టారు.
విజయవంతమైన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’తో సందీప్ కిషన్ నిర్మాతగా మారారు. వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్ నెం1గా ఆ సినిమా నిర్మించారు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’లో సందీప్ కిషన్ నిర్మాణ భాగస్వామి. వెంకటాద్రి టాకీస్ సంస్థలో అది ప్రొడక్షన్ నెం2. ఇప్పుడు ప్రొడక్షన్ నెం3గా ‘వివాహ భోజనంబు’ నిర్మించనున్నారు.
వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందనున్న ‘వివాహ భోజనంబు’చిత్రానికి సందీప్ కిషన్, శినీష్ నిర్మాతలు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత పి. కిరణ్ (జెమిని కిరణ్) సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. సోమవారం సినిమా ప్రీ–లుక్ విడుదల చేశారు. త్వరలో ఫస్ట్ లుక్‌తో పాటు ఈ సినిమాలో హీరో, హీరోయిన్, ఇతర నటీనటుల వివారాలను వెల్లడించనున్నారు.
సాంకేతిక వర్గం వివరాలు:
ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కె. నాయుడు – ఫణి కందుకూరి, వంశీ–శేఖర్, కూర్పు: ఛోటా కె. ప్రసాద్, కథ: భాను భోగవరపు, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: మణికందన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శివా చెర్రీ – సీతారామ్, సమర్పణ: పి. కిరణ్ (జెమిని కిరణ్), నిర్మాతలు: సందీప్ కిషన్, శినిష్, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







