ఇండియన్ అమెరికన్‌ను ప్రెస్ సెక్రటరీగా నియమించిన కమలా హ్యారిస్
- August 17, 2020
అమెరికా:అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన సెనెటర్ కమలా హ్యారిస్ తన క్యాంపెయిన్ ప్రెస్ సెక్రటరీగా ఇండియన్ అమెరికన్ సబ్రీనా సింగ్(32)ను నియమించారు. గత వారం కమలా హ్యారిస్‌ను డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నట్టు అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తెలిపారు. కమలా హారిస్ తండ్రి జమైకన్ కాగా.. ఆమె తల్లి భారతీయురాలు. దీంతో భారత సంతతికి చెందిన మహిళను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయడంపై భారతీయులు ఆనందం వ్యక్తం చేశారు. అటు అమెరికాతో పాటు ఇటు భారత్‌లోనూ గత వారం నుంచి కమలా హ్యరిస్ గురించే చర్చ సాగుతూ వస్తోంది. ఇక ఇప్పుడు తన ప్రెస్ సెక్రటరీగా కూడా కమలా హ్యారిస్ ఒక ఇండియన్ అమెరికన్‌ను నియమించడం విశేషం. కాగా.. సబ్రీనా సింగ్ గతంలో ఇద్దరు డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థులకు ప్రతినిధిగా వ్యవహరించారు. తనను ప్రెస్ సెక్రటరీగా నియమించడంపై సబ్రీనా సింగ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డెమొక్రటిక్ పార్టీ నవంబర్‌లో గెలిచేందుకు ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే తాను పనిలో నిమగ్నమవుతానంటూ సబ్రీనా సింగ్ చెప్పారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!