అబుధాబిలో క్రెడిట్‌ కార్డ్‌ రెంట్‌ పేమెంట్‌ కొత్త ప్లాన్‌ విడుదల

- August 18, 2020 , by Maagulf
అబుధాబిలో క్రెడిట్‌ కార్డ్‌ రెంట్‌ పేమెంట్‌ కొత్త ప్లాన్‌ విడుదల

అబుధాబి:క్రెడిట్‌ కార్డుల ద్వారా రెంట్స్‌ పేమెంట్‌కి సంబంధించి లేటెస్ట్‌ ఇన్సెంటివ్‌ని క్యాష్‌ ట్రాప్డ్‌ కస్టమర్స్‌ కోసం ప్రారంభించడం జరిగింది.అబుధాబి ప్రాపర్టీ డెవలపర్‌, రెంట్‌ టు ఓన్‌ స్కీమ్ కోసం దీన్ని ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు వివరించాలి. అల్డార్‌ ప్రాపర్టీస్‌ ఈ విషయమై మాట్లాడుతూ, ఆగస్ట్‌ 17 నుంచి క్రెడిట్‌ కార్డుల ద్వారా రెంట్‌ చెల్లించే వెసులుబాటు తీసుకొచ్చినట్లు పేర్కొంది. కన్వీనియెంట్‌ మరియు ఫ్లెక్సిబుల్‌ పేమెంట్‌ సొల్యూషన్స్‌లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు. అల్డార్‌ ప్రాపర్టీస్‌ పోర్ట్‌ ఫోలియో మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మెక్దాద్‌ అల్‌ ముబారక్‌ మాట్లాడుతూ, ఈ విధానం వినియోగదారులకు ఎంతో సులువుగా వుంటుందని చెప్పారు. యూఏఈ రిజిస్టర్డ్‌ క్రెడిట్‌ కార్డులతో అడ్వాన్స్‌ రెంట్‌ పేమెంట్స్‌ కూడా చేయడానికి వీలుంది.వెస్ట్‌ యాస్‌, అన్సామ్, అల్‌ హదీల్‌ మరియు మీరా ప్రాంతాల్లో కూడా ఈ విధానంలోనే చెల్లింపులు చేయవచ్చు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com