ఒమన్ లో 5 నెలల తర్వాత రెస్టారెంట్లు, జిమ్ లు,మార్కెట్లు పునఃప్రారంభం
- August 18, 2020
ఒమన్:కరోనా దెబ్బతో 5 నెలలుగా మూతపడిన ఒమన్ రెస్టారెంట్లు, జిమ్ లు, మార్కెట్లు, క్రీడా ప్రాంగణాలు మళ్లీ తెరుచుకోనున్నాయి. రెండు వారాల పాటు వివిధ గవర్నరేట్ల మధ్య పూర్తిస్థాయిలో రాకపోకలపై విధించిన నిషేధం, రాత్రి జనసంచారంపై ఆంక్షలు సత్ఫలితాలు ఇచ్చినట్లు కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ అభిప్రాయపడింది. కరోనా నియంత్రణ కోసం పని చేస్తున్న వివిధ విభాగాల నిపుణుల నుంచి అందిన నివేదికలను పరిశీలించిన సుప్రీం కమిటీ అన్ లాక్ 5ని ప్రకటించింది. సాధారణ జన జీవనాన్ని పునరుద్ధరించేందుకు ఐదో దశలో భాగంగా పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చింది.
సుప్రీం కమిటీ ఇచ్చిన మినహాయింపులతో ఆతిథ్య, పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా అంతర్జాతీయ, పర్యాటక రెస్టారెంట్లు ఇక ప్రారంభం కానున్నాయి. సాధారణంగా తమ సేవలను అందించనున్నాయి. హోటల్స్ కు వచ్చే ఆతిథులు జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ వినియోగించుకోవచ్చు. ఒమన్ లోని ఫేమస్ మార్కెట్ ముత్రహ సౌఖ్ తో పాటు అన్ని ఫిష్ మార్కెట్లు, వాణిజ్య మార్కెట్లు పునప్రారంభం కానున్నాయి. అంతేకాదు సుప్రీం కమిటీ నిర్ణయంతో దాదాపు 5 నెలల తర్వాత మళ్లీ న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లతో పాటు అన్ని రకాల ప్రచురణలు మళ్లీ జనం ముందుకు రాబోతున్నాయి. అలాగే క్రీడా శిక్షణ శిబిరాలు, సిమ్ కార్డుల అమ్మకాలు, కార్ వాష్, పోగాకు ఉత్పత్తుల అమ్మకాలకు సుప్రీం కమిటీ అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..