ఒకే గ్రూపులోని ప్రైవేట్ సంస్థల్లో ప్రవాసీయుల బదిలీకి అంగీకరించిన ఓమన్

- August 19, 2020 , by Maagulf
ఒకే గ్రూపులోని ప్రైవేట్ సంస్థల్లో ప్రవాసీయుల బదిలీకి అంగీకరించిన ఓమన్

మస్కట్:ఐ.ఎఫ్.ఎస్.యూ దీర్ఘకాల పోరాట లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. ఒకే యాజమాన్యంలోని పలు ప్రైవేట్ సంస్థలకు ప్రవాస కార్మికులను బదిలీ చేసుకునేందుకు ఒమన్ ప్రభుత్వం అంగీకరించింది. తద్వారా ప్రైవేట్ సంస్థల్లో ఒమనైజేషన్ నిబంధనలకు కట్టుబడి అదనపు శ్రామికశక్తిని నియమించుకునేందుకు వెసులుబాటు కలగనుంది. అయితే..ప్రవాస కార్మికుల బదిలీలకు సంబంధించి ఒమన్ ప్రభుత్వం కొన్ని షరతులు కూడా విధించింది. ఈ మేరకు ప్రవాస కార్మికులను ఒకే యాజమాన్యం ఆధ్వర్యంలో నడిచే ప్రైవేట్ సంస్థలకు మాత్రమే బదిలీ చేసేందుకు వీలుంటుంది. అలాగే ఆయా ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా పర్యాటక రంగంలో సేవలు అందించేవిగా ఉండాలి. బదిలి అయ్యే ప్రవాస కార్మికుడు తప్పనిసరిగా..బదిలీ అవుతున్న రంగంలో ప్రొఫిషనల్ లైసెన్స్ పొందిన వ్యక్తి అయి ఉండాలి. అంతేకాదు సదరు సంస్థ, కంపెనీ తప్పనిసరిగా ఒమనైజేషన్ లక్ష్యాన్ని పాటించాలి. ఇక ఒమనైజేషన్, దానికి తాలుకు నిషేధాన్ని ఎదుర్కుంటున్న వారు అయి ఉండకూడదు. ఒమన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రైవేట్ సంస్థల్లో అవసరమైన చోట శ్రామిక శక్తిని బలోపేతం చేసుకునేందుకు అవకాశం కలగనుంది. అదనంగా ఉద్యోగుల్ని నియమించుకునేందుకు కూడా వెసులుబాటు దక్కనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com