13 దేశాలతో ఎయిర్ బబూల్ ఒప్పంద చర్చలు-హర్దీప్ సింగ్ పురీ
- August 18, 2020
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఎయిర్ బబూల్ ఒప్పందానికి సంబంధించి మరో 13 దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ గురువారం వెల్లడించారు. కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం విదేశీ విమానాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ఇతర దేశాలు కూడా ఇదే విధమైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. అయితే రెండు దేశాల మధ్య ఎయిర్ బబూల్ ఒప్పందం జరిగితే ఇరు దేశాల మధ్య అతి తక్కువ ఆంక్షలతో అంతర్జాతీయ విమానాలు నడిచేందుకు అనుమతి లభిస్తుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం జూలై నుండి అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మని, యూఏఈ, ఖతర్, మాల్దీవుల ప్రభుత్వాలతో ఎయిర్ బబూల్ ఒప్పందం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా, ఇటలీ, జపాన్, న్యూజిల్యాండ్, నైజీరియా, బహ్రెయిన్, ఇజ్రాయెల్, కెన్యా, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, సౌత్ కొరియా, థాయ్‌ల్యాండ్ ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నట్టు హర్దీప్ సింగ్ పురి తెలిపారు. సరిహద్దు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ దేశాలను కూడా సంపద్రిస్తున్నట్టు పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ఒప్పందం జరగడం వల్ల ఇరు దేశాల్లో చిక్కుకున్న వారికి ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







