రియాద్ లో ఈ-ఆంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా

- August 19, 2020 , by Maagulf
రియాద్ లో ఈ-ఆంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా

రియాద్:రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు నిలబెట్టేందుకు గోల్డెన్ ఆవర్స్ లో చికిత్స అందించటం అతి ముఖ్యం. గోల్డెన్ ఆవర్స్ లో అతి వేగంగా స్పందించేందుకు వీలుగా సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ-ఆంబులెన్స్ సేవలను రియాద్ లో ప్రారంభించింది. ఈ ఎలక్ట్రానిక్ ఆంబులెన్స్ సర్వీసులతో ఇప్పటికంటే మరింత వేగంగా స్పందించి బాధితులకు వైద్య సేవలు అందించేందుకు వీలు కలగనుంది. 'ఎలక్ట్రానిక్ మెడిక్ సిస్టమ్' పేరుతో సేవలు అందించే ఈ-ఆంబులెన్స్ సర్వీసులను రియాద్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బాందర్ బిన్ అబ్దులాజీజ్ తన కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ విధానంలో ఈ-ఆంబులెన్స్ కు 91 ఆస్పత్రులకు లింక్ అయి ఉంటుంది. ఒక్కసారి బాధితులను నుంచి వినతులు అందిన క్షణాల్లో 91 కేంద్రాలకు సమాచారం అందుతుంది. దీంతో సమీపంలో ఉండే వైద్య కేంద్రాల నుంచి ఆంబులెన్స్ లు బాధితుల దగ్గరికి చేరుకుంటాయి. అంతేకాదు..ముందే పొందుపర్చిన వివరాలతో బాధితులను వీలైనంత త్వరగా చేరే దగ్గరి మార్గాలను కూడా ఎలక్ట్రానిక్ మెడిక్ సిస్టమ్ సూచిస్తుంది. ఆంబులెన్స్ సిబ్బందిని అప్రమత్తం చేసి, బాధితులకు అవసరమైన వైద్య సామాగ్రిని వేగంగా సమకూర్చుకునేలా హెచ్చరిస్తుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com