సమ్మర్ డొనేషన్ డ్రైవ్ కొనసాగిస్తున్న ఐసీఆర్ఎఫ్
- August 19, 2020
బహ్రెయిన్: ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్‌ఎఫ్), 400 మందికి పైగా వర్కర్స్‌కి వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్, బిర్యానీతో కూడిన లంచ్ బాక్స్‌లను పంపిణీ చేసింది. భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సనద్ వద్ద అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ వర్క్ సైట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీఆర్ఎఫ్ వాలంటీర్లు, ఫేస్ మాస్కులు అలాగే యాంటీ బాక్టీరియల్ సోప్‌లను కూడా పంపిణీ చేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన ఫ్లయర్స్ని కూడా పంపిణీ చేశారు. సమ్మర్ నేపథ్యంలో ఎండ దెబ్బ తగలకుండా తగినంత నీటిని వర్కర్స్ తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామని ఐసీఆర్ఎఫ్ పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







