మాజీ ప్రధాని రాజీవ్‌కి TPCC ఘన నివాళి

- August 20, 2020 , by Maagulf
మాజీ ప్రధాని రాజీవ్‌కి TPCC ఘన నివాళి

హైదరాబాద్:స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.. ఉదయం సోమజిగూడా లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేశారు. అలాగే గాంధీభవన్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో TPCC అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్,  మల్లు రవి, దాసోజు శ్రవణ్, ఉజ్మా షకీర్, టి.కుమార్ రావ్, బొల్లు కిషన్, ప్రేమ్ లాల్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com