దుబాయ్ టు ఇండియా: ప్రీ ట్రావెల్ టెస్టింగ్ రెగ్యులేసన్స్ అప్‌డేట్
- August 20, 2020
యూఏఈ:ప్రీ ట్రావెల్ కోవిడ్ 19 టెస్టింగ్ రిక్వైర్‌మెంట్స్ విషయంలో రెండు ప్రధాన ఎయిర్‌లైన్స్ అప్‌డేట్‌ని విడుదల చేశాయి. దుబాయ్ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకుల కోసం ఈ అప్‌డేట్‌ని విడుదల చేయడం జరిగింది. దుబాయ్ నుంచి వెళ్ళే ప్రయాణీకులు తప్పనిసరిగా కోవిడ్ 19 నెగెటివ్ పిసిఆర్ టెస్ట్ రిజల్ట్‌ని తమతో తీసుకువెళ్ళాల్సి వుంటుందని ఫ్లై దుబాయ్ అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పష్టం చేశాయి. ప్రీ ట్రావెల్ ర్యాపిడ్ ఐజిజి / ఐజిజిఎం టెస్టింగ్ తప్పనిసరి కాదని ఫ్లై దుబాయ్ పేర్కొంది. ప్రయాణానికి 96 గంటలు ముందుగా కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ చేయించుకుంటేనే అది చెల్లుబాటవుతుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చెబుతోంది. 12 ఏళ్ళ లోపు చిన్నారులు.. సాధారణ నుంచి ఓ మోస్తరు డిజేబిలిటీ కలిగి వుంటే ఈ పరీక్ష నుంచి మినహాయింపు వుంటుంది. కాగా, ప్రయాణీకులు ఎయిర్ సువిధా సెల్ఫ్ రిపోర్టింగ్ సర్టిఫికెట్‌ని ఆన్‌లైన్‌లో నింపాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ









