సీక్రెట్ రివీల్ చేసిన నాని

- August 20, 2020 , by Maagulf
సీక్రెట్ రివీల్ చేసిన నాని

కెరీర్‌లో నాని తొలిసారి విలన్ రోల్ పోషిస్తోన్న అతని 25వ సినిమా 'వి' నేరుగా ఓటీటీలో రిలీజవుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాతలతో పాటు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నాని ప్రకటించాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న 'వి' మూవీలో సుధీర్‌బాబు, నివేదా థామస్‌, అదితిరావ్ హైదరి ప్రధాన పాత్రధారులు.

"ఇవి సాధారణ రోజులు కావు. ఇది సాధారణ అనుభవం కాబోదు. నా 25వ ఫిల్మ్ ప్రత్యేకమైంది. అనేక కారణాల రీత్యా మరింత ప్రత్యేకమైంది. దాన్ని మరపురానిదిగా మారుద్దాం. సెప్టెంబర్ 5ను సెలబ్రేట్ చేసుకుందాం. ఈ 12 సంవత్సరాలు నా కోసం మీరు థియేటర్లకు వచ్చారు. ఇప్పుడు నేను ఇంటికి వచ్చి మీకు థాంక్ యు చెబుతాను. రిలీజ్ రోజు మీ స్పందన వినడానికి ఉద్వేగంగా, నెర్వస్‌గా ఎదురుచూస్తుంటాను. థియేటర్లు ఓపెన్ అయ్యాక 'టక్ జగదీష్' వస్తాడు. ప్రామిస్" అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక నోట్‌ను షేర్ చేశాడు నాని.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com