ఇస్రో పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన చైర్మన్ శివన్
- August 20, 2020
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేటుపరం చేయనున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు ఆ సంస్థ చైర్మన్, సెక్రటరీ కె.శివన్ గురువారంనాడు తోసిపుచ్చారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని, ఇస్రో ప్రైవేటుపరం కాదని ఆయన స్పష్టం చేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణల ప్రకటన ప్రైవేటీకరణకు ఉద్దేశించినది ఎంతమాత్రం కాదని ఆయన చెప్పారు.
'ప్రభుత్వం స్పేస్ సెక్టార్లో సంస్కరణలు తెస్తున్నట్టు ప్రకటించగానే కొందరు ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనే అపోహలను తెరపైకి తెచ్చారు. అలాంటిదేమీ లేదు. ఇస్రో ప్రైవేటుపరం కాదని పదేపదే నేను చెబుతూనే ఉన్నాను' అని శివన్ పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులు కూడా అంతరిక్ష కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా మెకానిజం ఉంటుందని, లేదంటే ఇస్రోనే ఆ పని నిర్వహిస్తుందని వివరించారు. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో నిజమైన గేమ్-చేంజర్‌గా సంస్కరణలు ఉండబోతున్నాయని చెప్పారు. ప్రతిపాదిత స్పేస్ యాక్టివిటీ బిల్లు ముసాయిదా దాదాపు తుది దశలో ఉందని, త్వరలోనే ఆమోదం కోసం కేబినెట్ ముందుకు వస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







