యూఏఈ రెసిడెంట్స్‌కి తాజా హెచ్చరిక
- August 20, 2020
యూఏఈ:‘లీగల్ నోటిఫికేషన్’ పేరుతో వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా వేదికలపై సర్క్యులేట్ అవుతోన్న ఓ ఫేక్ నోటిఫికేషన్‌పై రెసిడెంట్స్‌ని అప్రమత్తం చేస్తున్నాయి సంబంధిత అథారిటీస్. ‘మీ బ్యాంక్ అకౌంట్ భద్రతా కారణాల రీత్యా ఫ్రీజ్ చేయబడింది. మీ పూర్తి వివరాలు వెరిఫై చేసుకోండి. లేని పక్షంలో అకౌంట్ శాశ్వతంగా సస్పెండ్ అవుతుంది’ అంటూ ఆ సందేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 24 గంటల్లోగా ఫోన్ చేయాలంటూ ఓ ఫోన్ నెంబర్ కూడా అందులో పొందుపరుస్తున్నారు స్కామర్స్. ఈ నేపథ్యంలో యూఏఈ సెంట్రల్ బ్యాంక్, ఇతర బ్యాంకులు తమ వినియోగదారుల్ని పలుమార్లు ఇదే విషయమై అప్రమత్తం చేయడం జరిగింది. వినియోగదారులెవరూ ఇలాంటి మెసేజ్‌ల పట్ల ఆకర్షితులవ్వొద్దనీ, ఆందోళన చెందవద్దనీ, వాటిని అసలు పట్టించుకోవద్దని సూచిస్తున్నారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







