ప్రయాణీకులకు డొమెస్టిక్‌ క్వారంటైన్‌ రద్దు చేసిన బహ్రెయిన్‌

- August 20, 2020 , by Maagulf
ప్రయాణీకులకు డొమెస్టిక్‌ క్వారంటైన్‌ రద్దు చేసిన బహ్రెయిన్‌

మనామా:దేశంలోకి వచ్చే ప్రయాణీకులకు డొమెస్టిక్‌ క్వారంటైన్‌ని రద్దు చేస్తూ బహ్రెయిన్‌ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి ఆగస్ట్‌ 16 మధ్య ప్రయాణీకుల్ని పరీక్షించగా కేవలం 0.2 శాతం ప్రయాణీకులు మాత్రమే కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టేట్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దేశంలోకి వచ్చేవారు తప్పనిసరిగా పీసీఆర్‌ టెస్ట్‌ చేయించుకునే విమానం ఎక్కాలని బహ్రెయిన్‌ చెబుతోంది. కాగా, అవసరమైతే హోం క్వారంటైన్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ని పాటిస్తామని ముందుగానే హామీ పత్రం ప్రయాణీకులు ఇవ్వాల్సి వుంటుంది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com