అజ్మన్‌లో కాన్సులర్‌ సర్వీసుల్ని అందిస్తోన్న ఇండియన్‌ అసోసియేషన్‌

- August 20, 2020 , by Maagulf
అజ్మన్‌లో కాన్సులర్‌ సర్వీసుల్ని అందిస్తోన్న ఇండియన్‌ అసోసియేషన్‌

అజ్మన్‌: అజ్మన్‌లో ఇండియన్‌ అసోసియేషన్‌, అల్‌ జుర్ఫ్ ప్రాంగణంలో కాన్సులర్‌ అటెస్టేషన్‌ సర్వీసుల్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్‌ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ సర్వీసులు అందిస్తారు. ప్రతి నెలా రెండవ మరియు నాలుగవ శుక్రవారాల్లో ఈ సర్వీసుల్ని అందిస్తున్నట్లు అసోసియేషన్‌ పేర్కొంది. ఈ సందర్భంగా కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అమన్‌ పురికి ఇండియన్‌ అసోసియేషన్‌ కృతజ్ఞతలు తెలిపింది. కాన్సులర్‌ సర్వీసులు అవసరమైనవారు అసోసియేషన్‌ని సంప్రదించాలని అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ రూప్‌ సిధు విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com