భారత రాయబారి ని కలిసిన APNRTS కువైట్ సమన్వయకర్తల బృందం
- August 20, 2020
కువైట్ సిటీ:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ తరుపున,మరియు ఏపిఎన్ఆర్టీఎస్ కువైట్ సమన్వయకర్తల బృందం తరుపున ముమ్మడి బాలిరెడ్డి కూవైట్ లో భారత ప్రభుత్వం తరపున నియమితులైన నూతన రాయబారి సెబి జార్జ్ ని బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో భారత రాయబారి ఆధ్వర్యాన జరిగిన తొలి సమావేశం ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముమ్మడి బాలిరెడ్డి బృందం కువైట్ లో ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న,ముఖ్యమైన సమస్యలను రాయబారికి వివరించారు.సమస్యల పై రాయబారి సానుకూలంగా స్పందించారు.
భారత రాయబారిని కలిసిన వారిలో ముమ్మడి బాలిరెడ్డి,నాయని మహేశ్వర్ రెడ్డి,షేక్ గఫార్,నాగిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి,అబు తురాబ్,పిడుగు సుబ్బా రెడ్డి,పోలూరు ప్రభాకర్ ఆకుల చలపతి, మురళి రాయల్ తదితరులున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







