ఐపీఎల్ ప్లేయర్లకు బీసీసీఐ హెచ్చరిక..
- August 20, 2020
యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు జరగనున్న ఐపీఎల్ 13వ ఎడిషన్ కోసం ఇప్పటికే టీంలు అక్కడికి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి. కింగ్స్ ఎలెవన్, రాజస్థాన్ రాయల్స్ జట్లు, సిబ్బంది ఇప్పటికే ప్రత్యేక విమానాల్లో దుబాయ్‌కి చేరుకున్నారు. అయితే టోర్నీ సందర్భంగా బీసీసీఐ ప్లేయర్లకు, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు హెచ్చరికలు జారీ చేసింది.
కోవిడ్ 19 రూల్స్ ను ఫ్రాంచైజీలు, ప్లేయర్లు బ్రేక్ చేయకూడదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి హెచ్చరించారు. దుబాయ్‌లో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్లేయర్లు, సిబ్బంది తిరగకూడదని, కచ్చితమైన నిబంధనలను పాటించాలని అన్నారు. బయో సెక్యూర్ బబుల్‌ను వీడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లేయర్లు, కోచింగ్ సిబ్బంది, ఓనర్లు, ఇతర సిబ్బంది కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
కాగా ఇటీవల ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఓ టెస్టు సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బయో సెక్యూర్ బబుల్ రూల్‌ను బ్రేక్ చేశాడు. దీంతో అతన్ని తరువాత టెస్టు నుంచి తప్పించారు. అందువల్ల ప్లేయర్లు, సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కేవలం ఒక్కరు బయటకు వెళ్లి తిరిగి వచ్చినా అది ఆ టీం మొత్తానికీ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందని, కనుక అందరూ జాగ్రత్తలను పాటించాలని బీసీసీఐ సూచించింది.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







