భార‌త్‌లోని 5 న‌గ‌రాల‌కు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ రిపాట్రియేష‌న్ విమానాలు

- August 21, 2020 , by Maagulf
భార‌త్‌లోని 5 న‌గ‌రాల‌కు ఎమిరేట్స్  ఎయిర్లైన్స్ రిపాట్రియేష‌న్ విమానాలు

దుబాయ్: దుబాయ్ ప్రధాన క్యారియర్ అయిన‌ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ భార‌త‌దేశంలోని 5 న‌గ‌రాల‌కు రిపాట్రియేష‌న్ విమానాలు న‌డ‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 20 నుంచి 31వ తేదీ మ‌ధ్య ఇండియాలోని బెంగళూరు, కొచ్చి, ఢిల్లీ, ముంబై, తిరువనంతపురంకు ఈ విమాన స‌ర్వీసులు న‌డుస్తాయ‌ని తెలిపింది. ఈ ప్రత్యేక విమానాలు యూఏఈలోని భారత‌ పౌరులు ఎవ‌రైతే స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారో వారిని తర‌లించ‌డానికి, అలాగే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న యూఏఈ నివాసితులు తిరిగి ఆ దేశానికి రావడానికి వీలు కల్పిస్తాయ‌ని ఈ విమాన‌యాన సంస్థ పేర్కొంది.‌

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌  స‌ర్వీసుల వివరాలు... 

బెంగళూరు: ఆగస్టు 21, 23, 25, 28, 30

కొచ్చి: ఆగస్టు 20, 22, 24, 27, 29, 31 (కొచ్చి నుంచి దుబాయ్‌కు న‌డిచే విమానాలు ఆగస్టు 21, 23, 25, 28, 30, సెప్టెంబర్ 1న ఉంటాయి.)

ఢిల్లీ: ఆగస్టు 31 వరకు రోజువారీ విమానాలు

ముంబై: ఆగస్టు 31 వరకు రోజువారీ విమానాలు

తిరువనంతపురం: ఆగస్టు 26 (తిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్లే విమానం ఆగస్టు 27న ఉంటుంది.) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com