సోషల్ యాక్టివిస్ట్ దేవి విడుదల చేసిన రాంగ్ గోపాల్ వర్మ టైటిల్ లోగో
- August 21, 2020
హైదరాబాద్:సుప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, సినీ విమర్శకుడు, దర్శకుడు ప్రభు తాజాగా 'రాంగ్ గోపాల్ వర్మ' అనే చిత్రం రూపొందిస్తున్నారు. ప్రముఖ హాస్య కథానాయకుడు షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించారు.
వ్యక్తులపై తీసే సినిమాలకు స్వతహా తాను వ్యతిరేకమైనప్పటికీ.. సమాజానికి చీడ పురుగులా దాపురించిన వ్యక్తిపై తీసిన 'రాంగ్ గోపాల్ వర్మ' చిత్రాన్ని తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ఏ సమాజం కారణంగా తాను మనుగడ సాగిస్తున్నాడో... ఆ సమాజానికి తాను జవాబుదారీ కాదని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రకటించుకునే వ్యక్తులను సామాజిక బహిష్కరణ చేయాల్సి ఉందని ఆమె ప్రకటించారు. ఈ చిత్రం కోసం సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన పాట తాను విన్నానని, చాలా బాగుందని ఆమె అన్నారు.
ఓ ప్రముఖ దర్శకుడి విపరీత చేష్టలకు చెంప పెట్టుగా తాను ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నానని. పతాక సన్నివేశాలు, పాట మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుందని రచయిత-దర్శకనిర్మాత ప్రభు తెలిపారు!!
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?